Mastaaru Mastaaru 2022 Lyrics IN TELUGU ( 2022)

Mastaaru Mastaaru 2022 Lyrics - Shweta Mohan IN TELUGU...


Mastaaru Mastaaru 2022
Singer Shweta Mohan
Composer GV Prakash Kumar
Music G. V. Prakash Kumar
Song Writer 'Saraswati Putra' Ramajogayya Sastry

Lyrics



‘సార్’లో ధనుష్, సంయుక్త



ధనుష్ హీరోగా రూపొందుతోన్న ద్విభాషా చిత్రం ‘సార్’. తమిళంలో ‘వాతి’ టైటిల్‌తో తెరకెక్కుతోంది. మలయాళ నటి సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరి ఈ ద్విభాషా చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. టాలీవుడ్‌కు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చిన సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా నుంచి ‘మాస్టారు మాస్టారు’ అంటూ సాగే పాటను గురువారం విడుదల చేశారు. తమిళంలో ఈ పాటను హీరో ధనుష్ స్వయంగా రాశారు. ‘వా వాతీ’ అంటూ సాగే ఈ పాట తెలుగు వెర్షన్‌ను సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి రచించారు.



 




పల్లవి





శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే

సీతకుమల్లే నీతో అడుగేసే మాటడిగిందే

నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే

అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నాలే

ఇంకపైనా నీకు నాకు ప్రేమ పాఠాలే..



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు



 





చరణం



ఏ వైపు పోనీవె నన్ను కాస్తయినా..

ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా..

ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా..

చూస్తున్నా వందేసి మార్కులు వేస్తున్నా



గుండెపై అలా నల్లపూసలా

వంద ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా..

ఒంటి పేరుతో ఇంటి పేరుగా

జంటగా నిను రాయాలంటున్నా..



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు

అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు



మాస్టారు మాస్టారు.. నా మనసును గెలిచారు



 





                                                                     అచ్చం నే కలగన్నట్టే.. నా పక్కన నిలిచారు.......




Mastaaru Mastaaru 2022 


Comments

Popular posts from this blog

Hridayam Lopala Song Lyrics in Telugu 2025

Hari Hara Veera Mallu | Song - Taara Taara (Lyrical) 2025

Asura HananamLyrical| HariHaraVeeraMallu | PSPK | BobbyDeol | MM Keeravaani |AM Rathnam|JyothiKrisna